నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... 17 మంది మృతి

  • జల్‌జలాలో జరిగే వైశాఖ పౌర్ణమి వేడుకలకు వెళ్తుండగా ప్రమాదం
  • అదుపుతప్పి 700 మీటర్ల లోయలో పడిన ప్రైవేటు జీపు
  • వర్షం కారణంగా బురద ఏర్పడి వాహనం జారిపడిందన్న పోలీసులు
నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోల్పా జిల్లాలోని పర్వత ప్రాంతంలో ఒక జీపు అదుపుతప్పి 700 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న వారిలో పదిహేడు మంది మృతి చెందారు. స్థానికులు జల్‌జలాలో జరిగే వైశాఖ పౌర్ణమి వేడుకలకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వర్షం కారణంగా బురద ఏర్పడి వాహనం జారిపడిందని పోలీసులు తెలిపారు. ప్రతికూల వాతావరణంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అన్నారు. ఘటన సమయంలో వాహనంలో ఎంతమంది ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది. 

17 killed in road accident in Nepal
Road Accident in Nepal

More Telugu News